‘సర్కారువారి పాట’ సంక్రాంతికి రావడం కష్టమేనా?

0
142

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే అభిమానుల్ని మెస్మరైజ్ చేసిన పరుశురామ్ .. ఈ సినిమాతో మహేశ్ కు అదిరిపోయే హిట్టివ్వాలని చూస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాటలు  ఓరేంజ్ లో ఉండబోతున్నాయట.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే సంక్రాంతి రేసులో రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆర్.ఆర్.ఆర్, లాంటి క్రేజీ మూవీస్ రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి.

అందుకే సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమాను తప్పించి .. సమ్మర్ కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.  ఈ సినిమాని ‘పోకిరి’ రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడమే తరువాయి అంటున్నారు. మరి నిజంగానే సర్కారువారి పాట సంక్రాంతి రేసులోంచి తప్పుకుంటుందేమో చూడాలి.