కేజీఎఫ్ -2 మూవీకి సర్కార్ శుభవార్త..

0
94

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎఫ్ -1. అయితే కెజిఎఫ్ 2 సినిమా ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. దీని కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

KGF 2 సినిమాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని అనుమతి ఇచ్చి చిత్రబృందానికి బంపర్ ఆఫర్ ప్రకటన చేసింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకోవచ్చని తెలిపింది. నాలుగు రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

మల్టీప్లెక్స్ స్క్రీన్లు, ఐమాక్స్, సింగిల్ స్క్రీన్, థియేటర్లు ఒక టికెట్ మీద 50 రూపాయలు, ఏసీ, ఎయిర్టెల్ థియేటర్ లు ఒక టికెట్ మీద 30 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. నాని ఏసీ థియేటర్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ సినిమా చూడాలనుకునేవారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.