స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల సునామి సృష్టించింది. మహేష్ యూఎస్ లో ఓ బ్యాంక్ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త లుక్ లో కనబడిన ఈ సినిమా ఐదవరోజు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 92.82కోట్ల వసూళ్లను తమ ఖాతాలో వేసుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ముఖ్యంగా నైజాంలో రూ.29.04 కోట్లు కల్లెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రబృందం వెల్లడించింది. గుంటూర్ లో రూ.7.82 కోట్లు, సీడెడ్ లో రూ.9.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.9.92 కోట్లు కలెక్షన్స్ రాబడినట్టు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గాను రూ. 76.24కోట్లు సాధించినట్టు తెలిపారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎన్ని కోట్ల కల్లెక్షన్స్ తమ సొంతం చేసుకోబోతుందో!