భరత్ అనునేను,సరిలేరు నీకెవ్వరు, మహర్షి చిత్రాలతో మహేష్ బాబు హ్యాట్రిక్ విజయాలు అందుకున్నతర్వాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు పరుశురాంతో చేస్తున్నాడు… ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది…
ఈచిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కు ఎప్పుడో టెంకాయ కొట్టారు కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు నిలిచి పోయింది… అన్ని కూదిరితే ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నారు… తొలి షెడ్యూల్ షూగింగ్ ను అమెరికాలో నిర్వహించడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ వేస్తున్నారు… అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది…
కథకు ఉన్న ప్రధాన్యతను బట్టి అమెరికాలో షూటింగ్ తీయనున్నారట… భ్యాంక్ మోసాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగనుంది… హీరో తల్లి బ్యాంక్ మేనేర్ ఆ బ్యాంక్ లో మోసం జరుగుతుందని మోసం చేసిన వ్యక్తి అమెరికాకు పారిపోతాడాని అతన్ని పట్టుకునేందుకు హీరో అక్కడకు వెళ్తాడని అతన్ని పట్టించి తల్లి నిర్దోషిగా ఎలా బయటకు తెస్తాడనే పాయింట్ తో కథ నడుస్తుందట..