సర్కారు వారి పాటలో కీలక పాత్ర కోసం సాయిపల్లవి ? ఏ రోల్ అంటే

సర్కారు వారి పాటలో కీలక పాత్ర కోసం సాయిపల్లవి ? ఏ రోల్ అంటే

0
111

సర్కారు వారి పాట చిత్రంలో ఇప్పటికే మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారు, అయితే తాజాగా రెండు రోజుల నుంచి మరో హీరోయిన్ ని వెతుకుతున్నారు అని వార్తలు వినిపించాయి, అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు మరో హీరోయిన్ నటించనున్నారు అని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో మరో కీలక రోల్ ఉంది.. ఆ పాత్ర కోసం హీరోయిన్ సాయిపల్లవిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది, ఈ సినిమాలో దర్శకుడు పరశురాం ఆమెని ఫైనల్ చేయాలి అని చూస్తున్నారట.

పొలిటికల్ థ్రిల్లర్ సినిమా నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నెగిటివ్ రోల్లో కనిపించనున్నారు అని తెలుస్తోంది, అయితే ఆమెకి స్టోరీ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే డేరింగ్ గా ఆమె ఈ సినిమాలో చేస్తాను అని తెలిపారట, సో మొత్తానికి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.