సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ ఫిక్స్

సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ ఫిక్స్

0
95

స‌ర్కారు వారి పాట టైటిల్ తో ఇప్పుడు అభిమానులు చిత్రం ఎలా ఉంటుందా అని ఆత్రుత‌లో ఉన్నారు, ఈ టైటిల్ మ‌హేష్ లుక్ అదిరిపోయింది, బ్యాంక్ మోసాల చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంది అని తెలుస్తోంది, అయితే ఇందులో ఉపేంద్ర లేదా సుదీప్ విల‌న్ రోల్ చేయ‌నున్నా‌ర‌ట‌, వీరిలో ఒక‌రిని ఎంపిక చేయ‌నున్నారు అని తెలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముందుగా కియారా అద్వానీ అనుకున్నారు. ప్రస్తుతం కియారా వరస కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమాలో చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది, అందుకే ఈ చిత్రంలో
మహాన‌టితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ను తీసుకున్నట్టు సమాచారం.

ఇక వైరస్ లాక్ డౌన్ వేళ మ‌హేష్ ఇప్పుడు సినిమా షూటింగ్ కు వ‌చ్చే అవ‌కాశం లేదు, ఈ చిత్రం డిసెంబ‌ర్ నుంచి స్టార్ట్ అవ్వ‌చ్చు అంటున్నారు , అప్ప‌టికి కీర్తి సురేష్ తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వ‌నుంద‌ట‌.