సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. తాజాగా కొత్త విడుదల తేదీ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 2022 ఏప్రిల్ 1న థియేటర్లలో సర్కారు వారి పాట సందడి చేయనుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బ్యాంక్ రుణాల ఎగవేత నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.