సర్కారు వారి పాటలో మరో హీరోయిన్?

సర్కారు వారి పాటలో మరో హీరోయిన్?

0
102

టాలీవుడ్ లో మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం చేశారు, సూపర్ హిట్ కొట్టారు, తర్వాత వెంటనే సినిమా అనౌన్స్ చేయలేదు, అయితే ఇటీవల కరోనా సమయంలో పరశురామ్ దర్శకత్వంలో ఓ స్టోరీ ఫైనల్ చేశారు, అదే సర్కారువారి పాట.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆడియన్స్ కి బాగా నచ్చింది, అయితే ఇందులో చాలా మంది కొత్త నటులని తీసుకోనున్నారట, ఇప్పటికే హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారు అని తెలుస్తోంది, అయితే కథలో భాగంగా మరో హీరోయిన్ రోల్ కూడా ఉంటుంది అని తెలుస్తోంది.

ఫారెన్ లో మహేష్ తో ట్రావెల్ చేసే సీన్ లో ఆమెకి రోల్ ఉంటుందట, అందుకే మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది, అయితే ఈ పాత్ర కోసం కొత్త హీరోయిన్ ని తీసుకునే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది..మహేశ్బాబు, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.