సర్కారువారి పాట బిజినెస్ పై టాలీవుడ్ టాక్

సర్కారువారి పాట బిజినెస్ పై టాలీవుడ్ టాక్

0
87

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తోంది అంటే అభిమానులకి పండుగ అనే చెప్పాలి ..ఇక టాలీవుడ్ లో అనేక రికార్డులు ఉన్నాయి ఆయన సినిమాలవి… అయితే తాజాగా ఆయన సర్కారు వారి పాట చిత్రంతో వస్తున్నారు… ఈ సినిమా కోసం అభిమానులు అలాగే తెలుగు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

టాలీవుడ్ సమాచారం ప్రకారం వార్తలు వింటూ ఉంటే .. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది.

ఉత్తరాంధ్రలో ఈ సినిమా 15 కోట్లకు అమ్ముడయినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇది భారీ డీల్ అని టాక్ నడుస్తోంది.. అయితే ఇంకా సినిమా పూర్తి కాలేదు కాని ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే డీల్ చర్చల్లో ఈ నెంబర్ వినిపించి ఉండవచ్చు అని టాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు.

 

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, మహేష్ బాబు ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి ఇది ఇప్పటి వరకూ రాని చాలా డిఫరెంట్ స్టోరీ, అంతేకాదు ఈ సినిమా చాలా వరకూ పారెన్ లో షూట్ చేస్తున్నారు, ఇక దర్శకుడు పరశురాం చాలా సూపర్ గా స్టోరీ రాశారట… మహేష్ బాబు తండ్రిగా మలయాళం హీరో జయరామ్ నటించనున్నట్లు తెలుస్తోంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో రానుంది.