మన సినిమాస్టార్ల అభిమానులు తమ అభిమాన నటుడి పేరు మీద షాపులకి పేర్లు పెడతారు, అంతేకాదు రెస్టారెంట్లు అయితే పేర్లతో పాటు డిష్ లకి కూడా వెరైటీ పేర్లు పెడతారు, మరికొందరు బట్టలు వాచెస్ ఇలా అనేక రకాల వస్తువులకి వారి పేర్లు పెట్టి ప్రమోట్ చేస్తారు.
ఇంకొందరు ఏకంగా కేకులపై ఫోటోలు కూడా వేస్తారు, అయితే ఆ నటుడి పోస్టర్స్ని ఇంటి నిండా పెట్టుకోవడం కూడా కొందరు చేస్తూ ఉంటారు, తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్.
అయితే ప్రభాస్ కి మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, బాహుబలి చిత్రంతో అఖండ ఖ్యాతి వచ్చింది, ఇప్పటికే చైనాలో ప్రభాస్ ఫోటోలు గాజు పాత్రలపై డిజైన్స్ ఇలా అనేక రకాల వస్తువులు అమ్మారు.. కొందరు బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ పేర్లతో ఫుడ్ ఐటమ్స్ విక్రయించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ పేరిట షుగర్లెస్ మింట్ క్యాండీస్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు..
ఎక్కడ అనుకుంటున్నారా, ఇది జపాన్ లో జరిగింది, అక్కడ అభిమానులు డార్లింగ్ పై ప్రేమతో ఇలా చేశారు.