వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు, ఇక తొలి సినిమా ఉప్పెనతో దేశంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకున్నారు… మెగా హీరోలు ఎవరూ సాధించలేని రికార్ట్ ఆయన పేరు మీద ఉంది, ఇక అభిమానులు కూడా ఆయన సినిమాకి మంచి పాజిటీవ్ టాక్ ఇచ్చారు, ఇటు టాలీవుడ్ ప్రముఖులు మెగా ఫ్యాన్స్ క్రిటిక్స్ అందరూ కూడా ఆయన నటన అద్బుతం అని అన్నారు.. తొలి చిత్రంతొ మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ఉప్పెన.. రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది, వందకోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.. ఇక ఉప్పెన సినిమా కోసం శాటిలైట్, ఓటీటీ వేదికలు ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.
తాజాగా తన మేనల్లుడి సక్సెస్, ప్రతిభ చూసి గర్వంగా ఫీల్ అయిన మెగాస్టార్ చిరంజీవి, వైష్ణవ్కి ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చారు. ఆయన ఇంటికి పిలిపించుకుని ఖరీదైన వాచ్ ని మేనల్లుడికి ఇచ్చారు, దీనికి సంబంధించి ఫోటో వైరల్ అవుతోంది,
వైష్ణవ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలియజేస్తూ చిరంజీవితో దిగిన ఫొటోను షేర్ చేశారు… ఈ ఫోటోకి పోస్టుకి మెగా అభిమానులు అభినందన కామెంట్లు పెడుతున్నారు.
ReplyForward
|