RGV : చనిపోయారని బాధపడకండి..కృష్ణ గారు ఆమెను కలిసే ఉంటారు!

-

Sensational director RGV tweet on super star krishna death:సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతిపై వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదని ఆర్జీవీ (RGV) ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ఆయన విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు అని అన్నారు. వారిద్దరూ కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గడుపుతుంటారని అనుకుంటున్నా అని ట్విట్టర్‌ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ నిర్మల, కృష్ణ కలిసి నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని వారిద్దరి పాటను ట్వీట్‌కు జత చేశాడు రామ్‌ గోపాల్‌ వర్మ.

- Advertisement -

కృష్ణ మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు. సినీ ప్రముఖులందరూ కృష్ణ భౌతిక కాయాన్ని దర్శించి, మహేష్‌ బాబుకు ధైర్యం చెప్తున్నారు. సూపర్‌ స్టార్‌ పార్థివదేహాన్ని చూసిన నటుడు మోహన్‌ బాబు వెక్కివెక్కి ఏడ్చారు. తనను కష్ట కాలంలో ఆదుకున్నదీ, ఇంత పేరు రావటానికి కారణం కృష్ణ గారే అంటూ మోహన్‌ బాబు గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...