సెన్సార్ పూర్తి చేసుకున్న KGF-2..రన్ టైమ్ ఎంతంటే?

0
99

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2.ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎఫ్ -1. ఇప్పుడు కెజిఎఫ్ చాఫ్టర్ 2 గా తెరకెక్కుతుంది.దీని కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. అయితే ఇప్పటికే కేజిఎఫ్ 2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఇక రెండు గంటల 48 నిమిషాల 02 సెకండ్లు సినిమాను లాక్ చేశారు. అంటే సినిమా దాదాపు మూడు గంటల పాటు కొనసాగుతుంది.  కాగా ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.