మహేష్ బాబు దేవుడు నాకు చాలా సాయం చేశారు సేతురామన్

మహేష్ బాబు దేవుడు నాకు చాలా సాయం చేశారు సేతురామన్

0
88

ఇటీవల సంక్రాంతికి విడుదల అయిన సినిమా సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమాలో రమణా లోడెత్తాల్రా ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే, అయితే ప్రతీ సినిమాలో ఓ స్పెషాలిటీ ఉంటుంది డైలాగ్ లో.. ఈ సినిమాలో మీకు అర్ధమవుతోందా అని రష్మిక అనడం, లోడెత్తాల్రా రమణ ఈ రెండు డైలాగులు బాగా పేరు సంపాదించాయి, ఇక నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ కూడా ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు అందరూ.

సినిమాలో రమణా లోడెత్తాల్రా .. అనే డైలాగ్ తో సేతురామన్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన మహేశ్ బాబుతో చేసే ఫైట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సీన్ గురించి తాజా ఇంటర్వ్యూలో సేతురామన్ ప్రస్తావించారు. ఈ సినిమాలో మా మధ్య ఫైట్ సమయంలో నేను నేలపై జారుతూ మహేష్ బాబుని హిట్ చేయాలి ,కాని చిన్న పొరపాటు వల్ల నా మోకాలికి గాయం అయింది, ఇక నేను నిలబడలేకపోయాను.

అది అడవి కావడంతో దగ్గరలో హాస్పిటల్స్ లేవు .. అందుబాటులో వున్నకేరళ వైద్యం చేయించారు. కంగారు పడకండి నేను చూసుకుంటాను’ అని మహేశ్ బాబు గారు అనడంతో నాకు ధైర్యం వచ్చేసింది. నేను చాలా కంగారు పడ్డా ఈ సమయంలో హైదరాబాద్ అపోలోకి మేనేజర్ ని కూడా నాతో పంపించారు, తన ఖర్చులతో ట్రీట్మెంట్ ఇప్పించారు. మహేశ్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి అని ప్రిన్స్ ని రమణ తెగ పొగిడేశారు, ఇక మహేష్ సాయం గురించి తెలిసిందే కదా, మహేష్ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు కూడా చేయిస్తారు.