Shah Rukh Khan | కీ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్..

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తన జీవితంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నాళ్లూ దేనికైతే బానిసయ్యాడో దానిని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ఇకపై ఆ దురలవాటు జోలికి కూడా వెళ్లనని తేల్చి చెప్పాడు షారుఖ్ ఖాన్. అదే సిగిరెట్లు కాల్చడం(Smoking). ఫారుఖ్ ఖాన్ చెయిన్ స్మోకర్. చెయిన్ స్మోకర్ అంటే రోజుకు రెండు మూడు పెట్టెలు కాల్చడం కాదు.. ఒక్క రోజుకు వందకు పైగా సిగిరెట్లే కాల్చేవాడు ఈ హీరో. ఇలా అస్తమానం నోట్లో సిగిరెట్లు ఉంటే షారుఖ్ ఆరోగ్యం ఏమవుతుందా? అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడేవాళ్లు. ఈ వ్యవసనాన్ని వదిలించుకుందామని షారుఖ్ ఖాన్ ఎన్నోసార్లు ప్రయత్నించినా ప్రతి సారి వ్యసనమే విజయం సాధించింది. అయితే తాజాగా ఎట్టకేలకు తన శత్రువులా మారిన తన అలవాటుపై విజయం సాధించానని అంటున్నాడు మన హీరో.

- Advertisement -

నవంబర్ 2న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలవడం కోసం మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమం చేపట్టాడు షారుఖ్. ఇందులో మాట్లాడుతూ.. మీకందరికీ ఓ గుడ్ న్యూస్ అని ప్రకటించాడు. ‘‘నేను సిగిరెట్లు తాగడం మానేశాను. వీటిని తాగడం మానేశాక కూడా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గలేదు. ఇప్పటికి కూడా కొన్నికొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దేవుడి దయ వల్ల అతిత్వరలోనే ఈ సమస్య కూడా తగ్గి అంతా బాగవుతుందని ఆశిస్తున్నా’’ అని షారుఖ్(Shah Rukh Khan) చెప్పాడు. షారుఖ్ మాటలు వినగానే అభిమానులంతా సంతోషంతో ఊగిపోయారు.

Read Also: ముఖంపై ముడతలా.. ఇవి ట్రై చేయండి..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...