ఆ సినిమాలకు దూరంగా షారుక్ ఖాన్‌..కారణం ఇదే!

Shah Rukh Khan away from those movies ..

0
110

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ ఇటీవలే అరెస్టు అయ్యాడు. ఈ కారణాలే ఇప్పుడు..షారుక్ తదుపరి సినిమాల షూటింగ్స్‌పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రంతో వెండితెరపై కనిపించారు.

అనంతరం ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ‘పఠాన్‌’తో పాటు దర్శకుడు అట్లీ చిత్రం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో కుమారుడు ఆర్యన్‌ అరెస్ట్‌ కావడం వల్ల ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ ఆగిపోయినట్లు సమాచారం. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చే వరకూ షారుక్ చిత్రాలకు దూరంగా ఉన్నట్లు నిర్ణయించుకున్నారట.

ఇక ‘పఠాన్‌’ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌ షెడ్యూల్‌.. అక్టోబర్‌10న స్పెయిన్‌లో ఖరారు చేశారు. ఈ షెడ్యూల్‌లో షారుక్, దీపిక పదుకొణెతో ఓ రొమాంటిక్‌ సాంగ్ లోనూ అలాగే పలు యాక్షన్‌ సన్నివేశాలు చేయాల్సి ఉండగా అవి ఆగిపోయాయి. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో వచ్చే చిత్రం షూటింగ్‌.. సౌత్‌ ముంబయిలో జరగాల్సి ఉండగా ఆ కార్యక్రమాలను నిలిపివేశారని తెలుస్తోంది.