Shah Rukh Khan | బాలీవుడ్‌ బాద్ షా.. షారుఖ్ ఖాన్‌కు ప్రమాదం

-

బాలీవుడ్‌ కింగ్‌ కాంగ్‌ షారుఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan) ఓ సినిమా సెట్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ లాస్‌ ఏంజిల్స్‌(Los Angeles)లో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. కాగా, ఈ షూటింగ్‌లో ఓ సీన్‌ చేస్తుండగా ముక్కుకి దెబ్బ తగిలి రక్తం కారినట్లు తెలుస్తోంది. వెంటనే చిత్రబృందం షారుఖ్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స జరిపిస్తున్నారట. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రక్తం ఆగడానికి చిన్న సర్జరీ చేసినట్లు డాక్టర్‌లు తెలిపినట్లు సమాచారం. కాగా, దీనిపై షారుఖ్ బృందం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక షారుఖ్ ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఏడాది పఠాన్‌తో తిరుగులేని కంబ్యాక్‌ ఇచ్చాడు. ఈ సినిమాతో షారుఖ్‌ వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా దంగల్‌ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిచిన హిందీ సినిమా ఇదే. మిక్స్డ్‌ టాక్‌తోనే ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు సాధించిందంటే షారుఖ్(Shah Rukh Khan) క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం షారుఖ్ నటించిన జవాన్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

- Advertisement -
Read Also:
1. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సలార్ టీజర్ అప్‌డేట్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...