షారుఖ్ ఖాన్ ఆ స్టార్ హీరో 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదట – ఎందుకంటే

Shah Rukh Khan has not spoken to that star hero for 16 years

0
116

బాలీవుడ్ లో స్టార్ హీరోలు కొందరు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని కథలు నలుగురు ముగ్గురు దగ్గరకు కూడా వెళతాయి. అయితే ఫైనల్ గా ఒక హీరో దానిని ఒకే చేస్తారు. అయితే ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు కూడా ఉంటాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హీరో సన్నిడియోల్ ఇద్దరూ బాలీవుడ్లో పెద్దనటులు అనే విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు 1993లో విడుదలైన డర్ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

ఇందులో సన్నీ హీరోగా చేశారు. ఇక షారుఖ్ విలన్ గా చేశారు. కాని సినిమాలో విలన్ పాత్ర షారుఖ్ కి గుర్తింపు తెచ్చింది. ఇదే సినిమా సన్ని డియోల్ ఇమేజ్ మొత్తాన్ని నాశనం చేసింది. ఈ సినిమాని తీసిన దర్శకుడు యశ్ చోప్రా ఈ సినిమాలో హీరో కంటే విలన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదం జరగలేదు.

దాదాపు 16 సంవత్సరాలు వారిద్దరు మాట్లాడుకోలేదట. షారుఖ్తో మాట్లాడేందుకు సన్ని డియోల్ ఆసక్తి చూపించలేదట. ఇక ఎక్కడైనా ఎదురుపడినా మాట్లాడుకునేవాళ్లం కాదు అని చెప్పాడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో విలన్ షారుఖ్ ఖాన్, హీరో అయిన సన్నిడియోల్ ను కొట్టే సన్నివేశం ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్ అయిన హీరోను ఎలా ఒక విలన్ కొడతాడని దర్శకుడితో సన్ని డియోల్ ప్రశ్నించాడు. కానీ క్లైమాక్స్ మార్చలేదు. అప్పటి నుంచి దర్శకుడు యశ్, షారుఖ్ ఖాన్లతో సన్ని డియోల్ మాట్లాడేందుకు ఇష్టపడలేదట. ఇక ఈ విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్ని డియోల్ తెలిపారు.