బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన విషయాన్ని మరువక ముందే బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh Khan) కూడా బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ఏంటని, బెదిరించింది ఎవరో చెప్తే చంపేస్తామంటూ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈరోజు ఉదయం ముంబై పోలీసులకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘‘రూ.50లక్షలు ఇవ్వకుంటే హీరో షారుఖ్ ఖాన్‌కు హాని తలపెడతా. ఫారుఖ్ భద్రంగా ఉండాలంటే డిమాండ్ చేసిన డబ్బు చెల్లించండి’’ అని డిమాండ్ చేశారు. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఆ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేయగా.. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై ఆ నెంబర్ రిజిస్టర్ అయినట్లు గుర్తించారు అధికారులు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ అతడి ఫోన్ నెంబర్ నవంబర్ 2న దొంగలించబడిందని, దానిపై తాను ఫిర్యాదు కూడా చేశానని ఫైజన్ ఖాన్.. పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లోకేషన్‌ను గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్(Shah rukh Khan)కు బెదిరింపులు రావడం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది అక్టోబర్‌లో కూడా షారుఖ్‌కు బెదిరింపులు వచ్చాయి.