తమిళ యువ దర్శకుడు అట్లీ(Atlee Kumar), బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో జవాన్(Jawan) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు మాస్ మోషన్ పోస్టర్ ద్వారా ఎనర్జిటిక్ అప్‌డేట్ ఇచ్చారు. బాద్‌షాను ఓ రేంజ్‌లో చూపించిన అట్లీ అండ్ టీమ్.. జవాన్(Jawan) సెప్టెంబర్ 7న థియేటర్స్‌లో సినిమా సందడి చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించనుండగా.. మరిన్ని వివరాలు త్వరలో షేర్ చేయబోతున్నారు. ఇక ఈ మోషన్ పోస్టర్‌పై స్పందిస్తున్న అభిమానులు.. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు రిలీజ్ కాబోతున్న మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే పఠాన్ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
Read Also: మెగాస్టార్ సినిమాలో టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో
Follow us on: Google News, Koo, Twitter