టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పనిచేసి సత్తా చాటింది. బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్ వంటి బడా హీరోలతో నటించి మెప్పింది. తాజాగా.. ఈ బుట్టబొమ్మకు బంపర్ ఆఫర్ వచ్చింది. వరుసగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ అమ్మడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) జోడిగా పూజా హెగ్డే((Pooja Hegde)) నటించనుంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌తో బాలీవుడ్లో షాహిద్ కపూర్‌కు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో షాహిద్మూవీతో అయినా.. పూజా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. షాహిద్ కపూర్‌తో నటించే సినిమాకు మళయాల దర్శకుడు రోషన్ ఆండ్రూస్(Rosshan Andrews) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు 28వ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also: శృంగారంలో మహిళలకు మూడ్ తెప్పించే 5 టచ్ లు!
Follow us on: Google News, Koo, Twitter