సీనియర్ నటి షకీలా ఇటీవల తన సినిమాల జోరు పెంచారు.. తాజాగా ఆమె సినిమాకి బ్రేకులు పడ్డాయి ఈ విషయం గురించి ఆమె తీవ్రంగా స్పందించారు.సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు
ఆమె నటిస్తూ నిర్మించిన లేడీస్ నాట్ అలౌడ్ సినిమాను సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డు రెండుసార్లు తిరస్కరించింది అని తెలియచేశారు.
ఈ చిత్రం సెన్సార్ చేయాలంటే కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఆమె మీడియాతో తెలియచేశారు. లేడీస్ నాట్ అలౌడ్ చిత్రంలో నటించడమే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరించారు.
అయితే ఈ జోనర్‌లో వచ్చిన చాలా చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ తమ సినిమాను తిరస్కరించడానికి కారణమేంటో తెలియడం లేదు. నా పేరు కారణమా? సాయిరాంగారు కారణమా? అని తెలియడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలు రాకూడదా వాటిని బ్రతికించరా అనిఆమె విమర్శించారు. ఇది ఫ్యామిలీ చిత్రం కాదు అని అడల్ట్ కామెడీ చిత్రం అనితాము ముందు ఈ విషయం చెప్పాము అని తెలియచేశారు.