హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న శంకర్ కూతురు – డైరెక్టర్ ఎవరంటే?

Shankar's daughter making an entry as a heroine

0
96

ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన చిత్రాలు తీశారాయన. స్టార్ హీరోలు ప్రతీ ఒక్కరు శంకర్ తో ఒక్క సారి అయినా సినిమా చేయాలి అని కోరుకుంటారు. ఇక కథపై ఎంతో నమ్మకంతో ముందుకు వెళతారు ఆయన. సౌత్ ఇండియాలో సూపర్ క్రేజ్ అందుకున్న దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. సమాజంలో విషయాలను ప్రజలకు అర్దం అయ్యేరితీలో సినిమాలో చూపించడం ఆయన స్టైల్.

తాజాగా ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ చిన్న కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విరుమన్. హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు ఈ సినిమా
2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

అదితీని హీరోయిన్గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. ఫుల్ ప్రిపరేషన్తో వస్తున్న అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నాను అన్నారు శంకర్. 2022లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ టీమ్ కి నెటిజన్లు సినిమా అభిమానులు
బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.