షణ్ముఖ్ జశ్వంత్ నెల ఆదాయం ఎంతో తెలుసా ?

షణ్ముఖ్ జశ్వంత్ నెల ఆదాయం ఎంతో తెలుసా ?

0
116

షన్నూ అలియాస్ షణ్ముఖ్ జశ్వంత్ ఇతని పేరు తెలియని వారు ఉండరు.. రెండు తెలుగు స్టేట్స్ లో అతనికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా యూ ట్యూబ్ లో స్టార్ అనే చెప్పాలి, ఇక అతని పేరుమీద యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు ఉన్నాయి, అయితే హీరోల సినిమాలు యూట్యూబ్ లో రిలీజ్ అయితే వారికి కూడా రాని రికార్డ్ వ్యూస్ ఇతని సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లకు వస్తాయి.

 

 

మొదట్లో కామెడీ, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ .. వెబ్ సిరీస్ తో ఎంతో పాపులారిటీ సంపాదించాడు, ది సాఫ్ట్ వేర్ డవలపర్ దీనికి సుమారు 80 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అంత ఫేమ్ వచ్చింది షన్ముక్ కి..

 

తాజాగా వచ్చిన సూర్య అనే వెబ్ సిరీస్కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక అతను బిగ్ బాస్ ఐదో సీజన్ కు సెలక్ట్ అయ్యాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి యూ ట్యూబ్ లో ఇంతలా దూసుకుపోతున్న షణ్ముక్ కు ఆదాయం ఎంత వస్తుంది అనేది అతని అభిమానుల ఆలోచన.. అయితే దీనిపై ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

షణ్ముఖ్ యూట్యూబ్ చానల్కు ప్రస్తుతం 3.32 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇక అతనికి వచ్చే వ్యూస్ బట్టి నెలకి 5 నుంచి 7 లక్షల ఆదాయం వస్తుందట, అంతేకాదు అతనికి వెబ్ సిరీస్ కు కూడా భారీ రెమ్యునరేషన్ వస్తుంది అంటున్నారు.. నెలకి ఆయన ఆదాయం పది లక్షలు ఉండవచ్చు అని సోషల్ మీడియా టాక్.