కొత్త కారు కొన్న షణ్ముఖ్ జస్వంత్ – డ్రైవర్ ని కూడా పెట్టుకుంటా

Shanmukh Jaswanth buys a new car- funny comments in social media

0
102

యూట్యూబ్ చూసే ప్రతీ ఒక్కరికి షణ్ముఖ్ జస్వంత్ తెలుసు. మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు.యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన జస్వంత్ అప్పుడప్పుడూ బుల్లితెర మీద ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్లలోనూ పాల్గొంటూ ఉంటాడు. ఇక ఆ మధ్య షణ్ముఖ్ మద్యం సేవించి కారు నడపడం, ఆ కేసుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి.

ఇక అతను నటించిన సూర్య వెబ్సిరీస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక తాజాగా తాను కొత్త కారు కొనుక్కున్న విషయాన్ని చెప్పాడు. దాని ముందు నిల్చున్న ఫొటోను షేర్ చేశాడు. ఓ పోస్ట్ ఆసక్తికరంగా పెట్టాడు షణ్ముఖ్. ఇది నేను హై, ఇది నా కొత్త కారు హై, ఇంకా పార్టీలు లేవు హై, త్వరలో డ్రైవర్ను కూడా పెట్టుకుంటా హై అని రాసుకొచ్చాడు.

ఇప్పటికే జరిగిన ఓ ప్రమాదం వల్ల తన ఇమేజ్ కు కొంత డ్యామేజ్ అయింది. ముందే నెగిటీవ్ కామెంట్లు రాకుండా తెలివిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు అని అభిమానులు అంటున్నారు. ముందు జాగ్రత్తగా అతడు తన కారుకు డ్రైవర్ను పెట్టుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ యంగ్ హీరో 15 లక్షలు విలువైన కారుని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

https://www.instagram.com/p/CRWTJmBF68L/?utm_source=ig_embed&ig_rid=79736253-1973-4bb7-a30e-33cea8cc0327