దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు..కారణం ఆమెనే!

Shanmukh's sensational comments on breakup with Deepti ..

0
106

బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించింది. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నిర్ణయంతో షన్నూ అభిమానులు షాక్ తిన్నారు. అయితే వీరి బ్రేకప్ కు సిరినే కారణమని గుసగుసలు వినిపించాయి.

అయితే తాజాగా దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీప్తితో బ్రేకప్ కు సిరి కారణం కాదని…కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉన్నానని… తనపై వ్యతిరేకతను పెరగడానికి అదే కారణమని తాను అనుకుంటున్నానని చెప్పాడు. అప్పటికే తాను దీప్తితో అలాగే శ్రీ హన్ తో సిరి రిలేషన్ షిప్ లో ఉన్నామని గుర్తు చేశాడు.

ఈ క్రమంలో సిరితో కాస్త చనువు పెరగడంతో అందరిలోనూ తనపై వ్యతిరేకత పెరిగిందని షణ్ముఖ్ తెలిపాడు. తన వల్ల దీప్తి నెగిటివిటీని ఎదుర్కోవద్దని తెలిపాడు. నెటిజన్లు తనను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా దీప్తి తనని సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు. ఈ విషయంలో అందరి నుంచి దీప్తి ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని…ఆ ఒత్తిడిని ఆమె నుంచి దూరం చేసేందుకే బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది అన్నాడు. ఇక తిరిగి భవిష్యత్తులో తాము కలిసేది దేవుడి చేతిలో ఉందని షణ్ముఖ అన్నాడు.