శర్వానంద్ కు త్వరలో పెళ్లి ? అమ్మాయి ఎవరు?

శర్వానంద్ కు త్వరలో పెళ్లి ? అమ్మాయి ఎవరు?

0
81

ఈ 2020 సంవత్సరంలో టాలీవుడ్ లో యంగ్ హీరోల వివాహాలు వరుసగా జరుగుతున్నాయి, ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో పరిమిత కుటుంబ సభ్యుల మధ్య వివాహాలు జరుగుతున్నాయి,
ఇప్పటికే యంగ్ హీరోలైన నిఖిల్ , నితిన్, రానా లు పెళ్లి చేసుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి నీహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.

ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు నటుడు రాజా కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా వివాహం చేసుకోబోతున్నారట, మరి ఆయనెవరంటే,
యంగ్ హీరో శర్వానంద్ , ఓ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఆమెని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఆమె కూడా వ్యాపార రంగంలో ఉందట, అయితే కుదిరితే ఈ ఏడాది లేదా నెక్ట్స్ ఇయర్ వివాహం జరుగుతుంది అని తెలుస్తోంది, అయితే ఈ ఏడాది బహుశా నిశ్చితార్ధం జరగచ్చు అంటున్నారు.
ఇప్పుడు శర్వానంద్ శ్రీకారం అనే మూవీలో నటించనున్నారు. అంతేకాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇక ఆయన అభిమానులు ఈ వార్త తెలిసి జోష్ మీద ఉన్నారు.