టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) కారు ఆదివారం తెల్లవారుజామున ఫిలింనగర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే, తనకు జరిగిన ప్రమాదంపై తాజాగా శర్వానంద్ స్పందించారు. ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని, తాను క్షేమంగా ఉన్నానంటూ శర్వానంద్ ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఉదయం నా కారుకు యాక్సిడెంట్ అయినట్టు వార్తలు వచ్చాయి. అది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సుల వల్ల నేను క్షేమంగా ఉన్నాను. నా గురించి చింతించకండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని శర్వానంద్ తెలిపారు.