టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు

She is the daughter of director Kodi Ramakrishna, who is making her entry into the Tollywood industry

0
84

కోడి రామకృష్ణ ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. ఎందుకంటే అన్ని గొప్ప చిత్రాలను తీశారాయన. ఇక ఆయన సినిమా తీస్తున్నారంటే అందులో మనకు ఓ మంచి వేషం వస్తే బాగున్ను అని నటీనటులు అందరూ అనుకునేవారు.
భక్తి ప్రధాన చిత్రాలకు తనదైన గ్రాఫిక్స్ సొబగులు అద్ది మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు గ్రాఫిక్స్ అంటే ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నాం. కాని 20 ఏళ్ల క్రితం కూడా ఇంత విజువల్ వండర్ చిత్రాలు, గ్రాఫిక్స్ మాయాజాలం చేసి ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించేవారు ఆయన.

అరుంధతి సినిమాతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకర్షించారు కోడి రామకృష్ణ. 2019 ఫిబ్రవరి 22న తుది శ్వాస విడిచారు. తాజాగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా ఆమెని అభినందిస్తున్నారు. చిత్రసీమలో కోడిరామకృష్ణ దర్శకుడిగా తన ప్రతిభ చూపించారు.

ఇక ఆయన కుమార్తె నిర్మాతగా కెరీర్ మొదలు పెడుతున్నారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌజ్ను ప్రారంభించి సినిమాలు చేయనున్నట్లు కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ప్రకటించారు. ఇక తొలి సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రకటన వచ్చేసింది మీరు చూడండి