హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న శేఖర్ మాస్టర్ కూతురు..

0
77

డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక మంది స్టార్ హీరోలకి కొరియోగ్రాఫర్ గా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు కూడా పనిచేశారు. కేవలం శేఖర్ మాస్టరే కాకుండా..అతని కూతురు సాహితి, కొడుకు విన్నీ కూడా బుల్లితెర, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

విన్నీ అయితే ఇటీవల విడుదలైన అంటే సుందరానికి సినిమాలో చిన్ననాటి నాని పాత్రలో కూడా నటించి మెప్పించాడు. తాజాగా శేఖర్ మాస్టర్ కూతురికి సంబందించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఒక కొత్త దర్శకుడు ఆమెకు కథ చెప్పారని శేఖర్ మాస్టర్ కు కూడా కథ నచ్చడంతో ఆమెతో సినిమా చేసేందుకు డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. డైరెక్టర్ కొత్తవాడు అయినా మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోను సినిమాలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్పుడు సాహితీ హీరోయిన్గా మారే అవకాశం ఉందని వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది