8 ఏళ్లు మంచంపైనే శివశంకర్ మాస్టర్..చిన్న వయసులో ఇంత కష్టమా!

Shivashankar master in bed for 8 years..is it so difficult at a young age!

0
100

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కొద్ది రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివశింకర్‌ మాస్టర్‌ నిన్న సాయంత్రం కన్నుమూశారు. అయితే ఆయన గురించి మనకు తెలియని విషయాలెన్నో. ఇప్పుడు ఆయన మరణం తర్వాత శివశంకర్ మాస్టర్ కష్టం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగడం లేదు.

శివశంకర్‌ మాస్టర్‌ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి కొత్వాల్‌ చావిడిలో హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారం చేసేవారు. శివశంకర్‌కు ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు వాళ్ల పెద్దమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇంటి బయట కూర్చుంది. అదే సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చింది. అది తమ మీదకు వస్తుందేమోనని శివశంకర్‌ పెద్దమ్మ భయపడి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న శివశంకర్‌ కూడా కింద పడిపోయాడు. దీంతో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది.

ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా శివశంకర్ మాస్టర్ కి నయం కాలేదు. ఆ సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పని చేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే డాక్టర్ దగ్గరికి శివశంకర్‌ను తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. ఈయన నడవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పారు. దీంతో శివశంకర్ తల్లితండ్రులు బాధలో మునిగిపోయారు. అప్పుడు ఆ డాక్టర్‌ శివశంకర్‌ తల్లిదండ్రులతో ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేయండి. నేను చికిత్స ఇచ్చి లేచి నడిచేలా చేస్తాను అని చెప్పడంతో సరే అన్నారు. అంతే సుమారు ఎనిమిదేళ్ల పాటు శివ శంకర్‌ పడుకునే ఉన్నారు. ఆ తర్వాత ఆయన నడవడం మొదలుపెట్టారు.