శివశంకర్​ మాస్టర్​ అంత్యక్రియలు పూర్తి

Shivashankar Master's funeral is complete

0
82

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. అతని మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో ఉంది.మణికొండలోని పంచవటి కాలనీలో నివాసానికి చేరుకున్న రాజశేఖర్..శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

అనంతరం కుటుంబసభ్యులు శివశంకర్ మాస్టర్ భౌతికకాయానికి ఫిల్మ్​నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన చిన్నకుమారుడు అజయ్ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరోవైపు శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ కరోనాతో పోరాడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.