తెలుగు హీరోల్లో సోగ్గాడు అంటే వెంటనే చెప్పేది శోభన్ బాబు పేరు, ఆయన అంటే మహిళలకు చాలా ఇష్టం ఆయన సినిమాలకు ఎక్కువ మహిళా ఫ్యాన్స్ ఉండేవారు, అద్బుతమైన ఫ్యామిలీ హీరోగా ఆయన పేరు సంపాదించారు, సోగ్గాడుగా సౌత్ ఇండియాలో మార్క్ పొందారు.
అయితే ఇండియాలో ఉన్న పాపులర్ హీరోలు అందరిలో ఎవరి దగ్గర లేని ఆస్తి ఆయన దగ్గర ఉంది అంటారు, నిజమే ఆయన సంపాదించిన సంపాదన కేవలం ఇంటి ఖర్చులు మినహా మిగిలింది అంతా రియల్ ఎస్టేట్ భూములు పొలాలు కొనేవారు, ఇలా కొన్న భూములు అన్నీ మద్రాసు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నాయి.
ద్రాక్ష తోటలపై కూడా భారీగా ఇన్వెస్ట్ చేశారు, ఇలా ఇప్పుడు వాటి విలువ లక్ష కోట్ల పైమాటే అంటున్నారు చాలా మంది, అంతేకాదు ఎక్కువగా మద్రాస్ లో వేల ఎకరాలు కొన్నారు. 2008లో ఆయన మరణించే సరికి అప్పట్లో వాటి విలువ 80వేల కోట్లు దాటాయి అంటారు, ఏదైనా ఆర్ధిక క్రమ శిక్షణ నేర్పింది ఆయనే అని చెప్పాలి, దాదాపు అందరూ హీరోలు ఆయనని చూసి చాలా వరకూ పెట్టుబడి ఎలా పెట్టాలో నేర్చుకున్నారు, అంతేకాదు షేర్లలో కూడా ఆయన పెట్టుబడి పెట్టేవారట.