టాలీవుడ్ లో అందాల నటుడు శోభన్బాబు , అంతేకాదు సోగ్గాడిగా ఆయనని పిలుస్తారు అందరూ, ముఖ్యంగా మహిళా అభిమానులకి ఆయనంటే ప్రాణం, సోగ్గాడిగా రింగ్ తిప్పుతూ ఉంటే ఆయనకి లక్షల మంది ఫిదా అయ్యారు, అంతేకాదు ఆయనకు ఉన్న ఆర్ధిక క్రమ శిక్షణ దేశంలో ఏ చిత్ర సీమలో హీరోకి లేదు అని అందరూ అంటారు.
అయితే ఆయన లేకపోయినా ఆయన సినిమాలు అభిమానుల గుండెల్లో అలా నిలిచి ఉంటాయి, అయితే ఆయన చివరి రోజుల్లో మంచి పాత్రలు వచ్చినా సినిమాలు చేయలేదు, అంతేకాదు తండ్రి పాత్రలు వచ్చినా ఆయన నో చెప్పారు, హీరో పాత్రలు వచ్చినా చేయను అన్నారు దీనికి కారణం ఉంది.
తనను అందంగా చూసిన ప్రేక్షకులు ముసలితనంగా చూడలేరన్న భావనతో స్వచ్ఛందంగానే సినిమాలకు స్వస్తి పలికారాయన.
ఈ విషయం చాలా మందికి తెలియదు, తనని అందరూ ఎలా చూశారో అలాగే గుర్తు ఉండాలి అని తర్వాత ఎలాంటి సినిమాలు చేయలేదు, అందుకే ఆయనంటే అందరికి ప్రత్యేక అభిమానం.