బాలయ్యకు షాకిచ్చిన సోనాక్షి సిన్హా

బాలయ్యకు షాకిచ్చిన సోనాక్షి సిన్హా

0
105

బాలయ్య బాబు అభిమానులు తాజాగా ఆయన నటించిన చిత్రం రూలర్ కోసం వెయిట్ చేస్తున్నారు.. మరో వారంలో సినిమా వచ్చేస్తోంది. ఈ స్పీడులో బాలయ్య మరో సినిమా స్టార్ట్ చేశారు, అయితే ఈ సినిమా దర్శకుడు బోయపాటి కాంబోలో చేస్తున్నారు బాలయ్య, అయితే బాలయ్య బోయపాటికి ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు, ముఖ్యంగా నందమూరి బాలయ్య బాబు అభిమానులు అదే భావిస్తున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా సోనాక్షి సిన్హా నటించనున్నట్టుగా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు బోయపాటి ఆమెతో చర్చించారు అని వార్తలు వినిపించాయి.. దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ – బోయపాటి సినిమాలో తను నటించనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనీ, అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని చెప్పింది. తన తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటూ పుకార్లకు తెర దింపేసింది.

అయితే ఆమె ఎందుకు ఇలాంటి కామెంట్ చేసింది అనేది ఇప్పుడు ఇంకా చర్చ జరుగుతోంది. ఇంకా సినిమా ఫైనల్ కాకుండా సౌత్ ఇండియాలో చర్చ జరుగుతోంది అని సోనూకి ఆమె సన్నిహితులు చెప్పారట. అందుకే ఆమె ఇలా క్లారిటీ ఇచ్చారట. అయితే సినిమా కోసం డిస్కషన్స్ జరిగాయి కాని ఆమె ఒకే చెప్పలేదు అని తెలుస్తోంది.