ఈ హీరోయిన్ సంపాద‌న ఎంతో తెలిస్తే షాక్

Shock to know so much about the earnings of this heroine

0
106

సినిమా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని అవ‌కాశాలు పొందుతూ సూప‌ర్ హిట్లు వ‌స్తూ ఉంటే వారి సంపద కూడా పెరుగుతు ఉంటుంది. వారికి డేట్స్ కూడా ఖాళీ ఉండ‌వు. ఇలాంటి హీరోలు హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మ‌న దేశ చిత్ర సీమ‌లో. ఓప‌క్క సినిమాలు చేస్తూ మ‌రో ప‌క్క ప‌లు కంపెనీల యాడ్స్ అంబాసిడ‌ర్ గా ఉంటూ కోట్ల రూపాయ‌లు సంపాదిస్తారు.

బాలీవుడ్ లో ఓ హీరోయిన్ గురించి అదే అంటున్నారు సినిమా ప‌రిశ్ర‌మ వారు. ఆమె ఎవ‌రో కాదు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఆమెకి బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉంది. వరుస సినిమాలు, యాడ్స్‌‌తో ఫుల్ బిజీ అయిపొయింది. ఇక ఆమె ఆస్తుల విలువ సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయ‌లు ఉంటాయ‌ట‌.

ఆమె నెల సంపాదన 50 లక్షల రూపాయలపైనే ఉంటుంది అని అంటోంది బాలీవుడ్ మీడియా. అంతేకాదు అంతే రిచ్ లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోందట. ఇక సారా అలీఖాన్ వాడేవి అన్నీ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ ఉంటాయి. ఇక ఆమె వాడే వాచీలు, బ్యాగ్స్, కార్లు అన్నీ చాలా ఖ‌రీదు అయిన‌వే వాడుతుంద‌ట‌.