ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ కు మరో షాక్

ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ కు మరో షాక్

0
107

ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా బాహుబలి తర్వాత ఎంతో ప్రస్టేజియస్ గా జక్కన్న తెరకెక్కిస్తున్నారు.. అయితే ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ చరణ్ కలిసి నటిస్తున్నారు, దీంతో ఇటు మెగా నందమూరి అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు, ఇక ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు అనేసరికి మార్కెట్ కూడా బాగాపెరిగింది.

కొమురం భీమ్గా ఎన్టీఆర్.. అల్లూరి పాత్రలో చరణ్ నటిస్తోన్న సంగతి కూడా తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న దేశవ్యాప్తంగా పది భాషల్లో సినిమా విడుదల కానుంది… ఇటీవల ఎన్టీఆర్ కు సంబంధించి అడవిలో చిత్రీకరణ సందర్బంగా కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి, తాజాగా ఈ బెడద మరోసారి వచ్చింది.

ఈ చిత్రంలో చరణ్ మరదలు సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుంది. తాజాగా చరణ్, ఆలియా లుక్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బ్రిటీష్ సైనికాధికారి పాత్రలో చరణ్, పాతకాలం చీరకట్టులో ఆలియాభట్ కనపడుతున్నారు. ఈ ఫోటోలు చూసి చాలా మంది ఇది ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ లుక్ అంటున్నారు.. కాని చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.