సింగ‌ర్ క‌ల్ప‌న షాకింగ్ కామెంట్స్ – ఆరోజే చనిపోదామనుకున్నా

Shocking comments by Singer kalpana r-If that day wanted to die

0
214

టాలీవుడ్ లో ఎంతో మంది సింగ‌ర్స్ ఉన్నారు. కాని కొంత మంది మాత్రం త‌మ ప్ర‌త్యేక గాత్రంతో ఆక‌ట్టుకుంటారు. మంచి పాట‌ల‌తో నిత్యం మ‌న‌ల్ని అల‌రిస్తూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ సింగర్, సినీనటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్పన ఒక‌రు. ఆమె సింగ‌ర్ గానే కాదు ప‌లు సినిమాల్లో కూడా న‌టించారు.

ఎంత కష్టమైనా పాట‌నైనా ఆమె సులువుగా పాడుతుంది. ఇక ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చి 30 సినిమాల్లో న‌టించారు. దాదాపు సౌత్ ఇండియాలో ఆమె అన్నీ భాష‌ల్లో క‌లిపి 3000 పాట‌లు పాడారు.
బిగ్ బాస్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని ప్ర‌జ‌ల‌ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

గ‌తంలో త‌న‌కు ఎదురైన కొన్ని చేదు అనుభ‌వాలు పంచుకుంది ఆమె. తనకు నటనపై ఆసక్తి ఉన్నా కూడా అవుట్ డోర్ షూటింగ్స్ నచ్చకపోవడంతో నటనకు గుడ్ బై చెప్పిందట. రికార్డింగ్ కంటే లైవ్ సింగింగ్ అంటే ఇష్టమని తెలిపింది. త‌న తండ్రి త‌న‌కు గురువు అని తెలిపారు ఆమె.
2010 సంవత్సరంలో తను అన్ని పోగొట్టుకొందట. ఇక అవి తట్టుకోలేక చనిపోవాలని అనుకున్నానని తెలిపింది కల్పన. ఈ స‌మ‌యంలో చిత్ర‌గారు మలయాళ షో లో పాల్గొనమని అవకాశంఇచ్చార‌ట‌.
ఆ షోలో తాను విన్నర్ గా నిలవడంతో మంచి పేరు ప్ర‌తిఫ‌లం వ‌చ్చాయి అని ఆమె తెలిపారు.