తెలుగు బిగ్ బాస్ అభిమానులకి షాకింగ్ న్యూస్ ?

Shocking news for Telugu Bigg Boss fans?

0
112

 

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందా, కంటెస్టంట్లు ఎవరు వస్తారా అని ఎదురుచూశారు. మొత్తానికి ఇటీవల అయితే జూలైలో ఈ ప్రోమో వచ్చేస్తుంది, ఇక 25 నుంచి షో బిగెన్ అవుతుంది అని వార్తలు వినిపించాయి. కానీ ఇలాంటి వార్తల నడుమ ఓ క్లారిటీ అయితే వచ్చింది.

ఆ చానెల్లో బిగ్ బాస్ టైమింగ్స్లో ,ఆ స్లాట్లో ఓంకార్ కొత్త షో ప్రారంభం కాబోతోంది. దీంతో ఇక బిగ్ బాస్ ఇప్పట్లో లేనట్టే అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఐదో సీజన్ గురించి ఇంకా నిర్వాహాకులు ఎవరితో సంప్రదింపులు జరపలేదు అంటున్నారు. సిక్స్త్ సెన్స్ ప్రోమో చూసి ఇంకా బిగ్ బాస్ కు టైమ్ ఉంది అనేది క్లారిటీ వచ్చింది.

ఓంకార్ వ్యాఖ్యాతగా రాబోతోన్న ఈ నాల్గో సీజన్ ఈ వారమే ప్రారంభం కాబోతోంది. ఈ శనివారం జూన్ 12నుంచి రాత్రి 9 గంటలకు ఈ షో ప్రారంభం కాబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఇది కచ్చితంగా మూడు నెలలు ఉంటుంది,ఇదే సమయంలో బిగ్ బాస్ ఉంటుంది కాబట్టి, ఇది పూర్తి అయ్యాక బిగ్ బాస్ ఉండే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ చివర్లోగానీ, అక్టోబర్లో గానీ సీజన్ 5 సందడి షురూ కానుందట.