Flash: షాకింగ్..చిన్నవయసులోనే ఆట డ్యాన్స్ షో విన్నర్ అనుమానాస్పద మృతి

0
120

ప్రస్తుతం వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది  ప్రముఖ నటులు, దర్శకులు మరణించి ఎనలేని బాధను మిగిల్చారు. తాజాగా ఆట డాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటుచేసుకుంది.

ఈమె కేవలం ఆట డాన్స్ షో విన్నరే కాకుండా సీజన్ ఫోర్ కి జడ్జిగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఒక్కసారిగా మృతిచెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మరణవార్తను ఆట షో సందీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలియజేసాడు. కానీ ఇంకా ఈ మరణానికి గల వాస్తవాలు  తెలియాల్సి ఉంది.