ఇటీవల లాక్ డౌన్ టైమ్ లో దాదాపు మూడు నెలల పాటు చిత్ర పరిశ్రమకు సీరియల్స్ కు సంబంధించి షూటింగ్ ఎక్కడా జరగలేదు.. ఇక సినిమా హాళ్లు దాదాపు మూడు నెలలుగా మూత బడి ఉన్నాయి, ఇక షూటింగ్ జరగడం లేదు ఇటు బుల్లితెర సీరియల్స్ కామెడీ షోలు ఇవన్నీ కూడా షూటింగులు బంద్ అయ్యాయి.
తాజాగా వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్ , అయితే తమిళనాడులో కూడా ఇటీవల సీరియల్స్ కు షూటింగ్ కు ఒకే చెప్పారు..ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి షూటింగులకు అనుమతిని సాధించారు. ప్రభుత్వ అనుమతితో వారం రోజుల పాటు షూటింగులు జోరుగా సాగాయి.
అయితే, కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో… పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో, చెన్నై సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈనెల 19 నుంచి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించారు. దీంతో చాలా వరకూ ఇక్కడే షూటింగులు జరుగుతున్నాయి, అందుకే ఇక్కడ షూటింగ్ ఆపేశారు యూనిట్ సభ్యులు.