ఒక్కోసారి సినిమా షూటింగుల విషయాలు దర్శకులు నిర్మాతలు హీరోలు హీరోయిన్లు పంచుకుంటేనే తెలుస్తాయి, లేకపోతే ఆనాడు జరిగిన సరదా సంఘటనలు మరిచిపోలేని విషయాలు బయటకు తెలియవు, అయితే ఇలాంటిది తాజాగా గుర్తు చేసుకున్నారు దర్శకుడ ఏఎల్ విజయ్ .
తమిళంలో మదరాసు పట్టణం అనే సినిమా తీశారు, ఇందులో బ్రిటీష్ మోడల్, హీరోయిన్ అమీ జాక్సన్ నటించారు, ఈ సమయంలో ఆమెతో ఓరోజు షూటింగ్ జరుగుతోంది. చెన్నై మౌంట్ రోడ్డులో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎండ బాగా ఉంది, ఆరోజు 40 డిగ్రీల వేడి ఉంది, అయితే అక్కడ జట్కా బండి నుంచి దూకి ఆమె పరిగెత్తాలి సీన్.
అయితే ఆమె ఒక్కసారిగా ఏడ్వడం మొదలు పెట్టింది, అమీ జాక్సన్ ఎందుకు ఏడుస్తుందా అని అందరూ షాక్ అయ్యారు, అయితే అంత ఎండలో గుర్రం కష్టపడడం తాను చూడలేనని, దాన్ని దత్తత తీసుకుంటానని అమీ చెప్పిందట, దానికి ఫుల్ గా ఫుడ్ పెట్టి అప్పుడు షూటింగ్ చేశారట, అమీ జంతువులపై అంత ప్రేమ చూపిస్తుంది అని అందరూ చూసి ఆమెని అభినందించారు. ఇక రోబో చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఇంటికి వెళుతున్న సమయంలో ఆమె రోడ్డు పక్కన కుక్క పిల్లలకు చూసి వాటికి బిస్కెట్లు వాటర్ అందించింది.