షూటింగ్స్ లేక రోడ్డుపై పండ్లు అమ్ముతున్న సినిమా న‌టుడు

షూటింగ్స్ లేక రోడ్డుపై పండ్లు అమ్ముతున్న సినిమా న‌టుడు

0
111

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అత్యంత దారుణ‌మైన ప‌రిస్దితులు ఏర్ప‌డ్డాయి, కుటుంబాలు పోషించేందుకు అత్యంత దారుణ‌మైన ప‌రిస్దితి ఉంది, ఇక సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారికి కూడా ఉపాధి లేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు, సాధార‌ణ ప‌రిస్దితి వ‌చ్చి సినిమా షూటింగులు జ‌రుపుకునేది ఎప్పుడు అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు.

ఈ స‌మ‌యంలో ఓ న‌టుడు సినిమాలు లేక అవ‌కాశాలు లేక ఇప్పుడు లాక్ డౌన్ వేళ కుటుంబ పోష‌ణ కోసం బండిపై పండ్లు అమ్ముతున్నాడు. స్టార్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో నటించిన సోలంకి దివాకర్ ఒక తోపుడు బండిపై పండ్లు అమ్మడం వైరల్ గా మారింది.

ఇక కుటుంబం కోసం ఇలా చేస్తున్నాను అని ఇక చిన్న సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా ఇప్పుడు షూటింగ్ లేక ఖాళీగా ఉన్నాను అని, కాని కుటుంబం తిండికి ఇబ్బంది ఉంది, అందుకే ఇలా పండ్లు అమ్ముతున్నాను అని చెబుతున్నాడు ఆ న‌టుడు. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.