సినిమా పరిశ్రమలో ఒక్క ఛాన్స్ వస్తే తమ టాలెంట్ నిరూపించుకుంటాం అనేవారు చాలా మంది ఉన్నారు .ఇలా అవకాశాల కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షణ చేస్తున్న వారు ఉన్నారు.. దర్శకులుగా నటులుగా హీరోయిన్లుగా కమెడియన్లుగా అవ్వాలి అని కలలు కని ఊరు నుంచి పట్టణానికి వచ్చిన వారు చాలా మంది కృష్ణానగర్ లో కనిపిస్తారు, అయితే ఇలా ఎందరికి అవకాశాలు వచ్చాయి వారి టాలెంట్ తో నిలబడ్డారు.
ఇక ఇలాంటి నటులకి దర్శకులకి షార్ట్ ఫిలిమ్స్ చాలా హెల్ప్ చేశాయి ..మరి షార్ట్ ఫిల్మ్ ద్వారా టాప్ స్టేజ్ కు వచ్చిన నటులు ఎవరు అనేది చూద్దాం మన టాలీవుడ్ లో…విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో ఆయన ముందు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిలింలో నటించారు.
రాజ్ తరుణ్ 52 షార్ట్ ఫిలిమ్స్ లలో నటించిన తర్వాత ఆయనకు హీరోగా ఛాన్స్ వచ్చింది ఉయ్యాల జంపాల చిత్రంతో.
సుహాస్- కలర్ ఫోటో సినిమా సూపర్ హిట్ అయింది, అయితే తను కూడా ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు
విశ్వక్ సేన్ – పిట్ట కథ అనే షార్ట్ ఫిలింతో కెరియర్ ను స్టార్ట్ చేశాడు
తమిళ్ లో విజయ్ సేతుపతి-అక్కడ షార్ట్ ఫిలిమ్ లో నటించి స్టార్ హీరోగా అయ్యారు విజయ్ సేతుపతి
వైవా హర్ష మంచి కామెడీని అందిస్తూ టెలివిజన్ వెబ్ సర్కిల్ లో సూపర్ పేరు సంపాదించాడు హర్ష.
పూజిత పొన్నాడ
రీతు వర్మ
చాందినీ చౌదరి
ప్రియాంక జవాల్కర్ వీరందరూ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇప్పుడు టాలీవుడ్ లో మంచి అవకాశాలు పొందారు.