Bigg Boss 5- సిరిపై శ్రీరామ్‌ చంద్ర సంచలన వ్యాఖ్యలు

0
74

బిగ్ బాస్ సీజన్-5 ముగిసింది. విన్నర్‌గా సన్నీ, రన్నరప్‌గా షణ్ముక్‌ నిలవగా, సింగర్‌ శ్రీరామ చంద్ర మూడో స్థానంలో నిలిచాడు. తన ఆటతీరుతోనే కాకుండా, పాటలతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగా పెరిగింది. షో నుంచి బయటకు వచ్చేసిన అతడు తాజాగా అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ బజ్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.

షణ్ముఖ్‌, సిరి, జెస్సీతో మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చన్నాడు. నామినేషన్స్‌లో సన్నీ, తాను పిచ్చిపిచ్చిగా అరుచుకున్నప్పటికీ ఆ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లమని తెలిపాడు. నన్ను మొదటి వారం నుంచి నామినేట్‌ చేసిన ఏకైక వ్యక్తి యానీ మాస్టర్‌ అని చెప్పుకొచ్చాడు.

షణ్ముఖ్‌ సపోర్ట్‌ లేకపోతే సిరి టాప్‌ 5లోకి వచ్చేదా? అన్న ప్రశ్నకు లేదని శ్రీరామ్‌ సమాధానమిచ్చాడు. తనకు తెలిసినంత వరకు షణ్ను లేకపోయుంటే సిరి ఫినాలేలో అడుగుపెట్టేది కాదన్నాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో మానస్‌కు, తనకు మధ్య కోల్డ్‌వార్‌ జరిగేదని పేర్కొన్నాడు.