ఆస్పత్రిలో శ్రియ భర్త చేరిక..వైరల్ అవుతున్న ఫొటో..అసలేం జరిగిందంటే?

0
118

టాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ శ్రియ గురించి తెలియని వారు ఉండరు. అంతలా ఈ బ్యూటీ ప్రేక్షకులను మాయ చేసింది శ్రియ శరన్ తన అంద చందాలతో మాత్రమే కాదు తన పెర్ఫార్మన్స్ తో అటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హాలివుడ్ సినిమాల్లో సైతం శ్రియ తన సత్తా చాటింది. చాలా రోజుల నుంచి టాలీవుడ్‌ సినిమాలు చేయని ఈ బ్యూటీ.. ఇటీవలే “గమనం” అనే సినిమాతో వచ్చింది.

తను  చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని రోజులు తన పరువాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ  అమ్మడు సడెన్ గా 2018లో రష్యన్‌ బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను  పెళ్లాడింది.  గతేడాది తనకు 9 నెలల కూతురు(రాధ) ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం శ్రియ హిందీలో ‘దృశ్యం 2’లో నటిస్తోంది.అయితే శ్రియ తన సోషల్ మీడియా పోస్టుల్లో భర్త ఆండ్రూతో కలిసి రెచ్చిపోతూ అందాల విందు పెడుతుంది. అంతేనా తన భర్త ఆండ్రూ తో కలిసి విహారయాత్రలు చేస్తూ వాటిలోని బోల్డ్ మూమెంట్స్ సైతం సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయడం అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉండగా.. తాజాగా తన భర్త ఆస్పత్రిలో ఉన్న ఫోటోను షేర్‌ చేసి చాలాఏమోషనల్‌ అయింది శ్రియ. గత కొన్ని రోజులుగా శ్రీయ భర్త హెర్నియాతో బాధ పడుతున్నారన్నది శ్రియ. దీంతో.. ఇటీవల హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో ఆయన అడ్మిట్‌ అయ్యారు. ఆయనకు వైద్యులు ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు అతని పరిస్థితి బాగుందని శ్రియా పేర్కొంది. అనారోగ్యంతో.. ఉన్నప్పుడు పాపను కూడా ఎత్తుకోలేకపోయాడంటూ ఎమోషనల్‌ అయింది. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలిపింది. త్వరలోనే ఆయన కోలుకుని.. ఎప్పటి లాగే ఉంటాడని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది.