కమల్ హాసన్ ఆస్తులపై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు..!!

కమల్ హాసన్ ఆస్తులపై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు..

0
95

కమల్ హసాన్ ఆస్తులపై సొంత కూతురు శృతిహాసన్ సంచలనవ్యాఖ్యలు చేసింది.. తెలుగులో ‘కాటమరాయుడు’ చాల గ్యాప్ తీసుకుని ఈ మధ్యనే లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమాకు సైన్ చేసింది.అయితే శృతి హాసన్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.

ఇందులో తన తండ్రి ఆస్తుల గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానిమిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన తండ్రికి ఎన్ని ఆస్థులు ఉన్నాయో తనకు తెలియవనీ కనీసం ఆ విషయాల గురించి తను మాట్లాడననీ అంటూ కామెంట్ చేసింది.

తన తండ్రి తనను తన చెల్లెలునీ చాల మంచి స్కూల్స్ లో చదివిస్తూ ఆ తరువాత అమెరికాలోని బెస్ట్ కాలేజీలలో తమకు చదువులు చెప్పించాడని చెపుతూ తనకు 21 ఏళ్ళు వచ్చిన తరువాత తన తండ్రిని ఒక్క రూపాయి కూడ అడగలేదు అంటూ తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది.