భర్త పర్మిషన్ తీసుకున్నా నేను అలా చేస్తే ఆయనకు హ్యాపీ

భర్త పర్మిషన్ తీసుకున్నా నేను అలా చేస్తే ఆయనకు హ్యాపీ

0
105

తెలుగులో అగ్ర నటులు హీరోలు అందరితో హీరోయిన్ శ్రియ నటించింది.. ప్రస్తుత యంగ్ హీరోలకు కూడా హీరోయిన్ గా నటిస్తోంది.. చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలయ్య ప్రభాష్ మహేష్ బాబు పవన్ కల్యాణ్ ఇలా చాలా మంది హీరోలతో నటించింది ఆమె… గతేడాది మార్చిలో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కొశీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. అయితే కొద్ది మందిని మాత్రమే తన వివాహనికి పిలిచింది ఆమె.

రాజస్థాన్‌లో వీరి వివాహం జరిగింది.. ఈ పెళ్లి విషయాన్ని ఇప్పటి వరకు అత్యంత రహస్యంగా ఉంచగా తాజాగా, శ్రియ స్పందించింది. పెళ్లి విషయంలో దాయడానికి ఏమీ లేదని, అయితే తన జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకోవడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.

నటనను కొనసాగిస్తానని, ఈ విషయంలో తన భర్త సహకారం ఉందని చెప్పింది, తాను సినిమాలు చేసుకోవడానికి ఆయన పూర్తి స్వేచ్చ ఇచ్చారు అని చెప్పింది. తాను బిజీగా ఉంటేనే ఆయన ఆనందిస్తుంటారని తెలిపింది. తన పెళ్లై దాదాపు రెండేళ్లు అవుతున్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని శ్రియ నవ్వుతూ చెప్పింది.