బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్… ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచి వేసింది.. అసలు బీ టౌన్ మొత్తం షాక్ అయింది..ఎంఎస్ ధోనీ, ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలతో ఇండియా వైడ్ పాపులార్టీ తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఎంతో మందిని కలచివేస్తోంది, ఇక ఆయన ఎందుకు మరణించారు అనేదానిపై పూర్తిగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
అంతరిక్షం, దాని పరిశోధనలంటే సుశాంత్ కు ఎక్కువగా ఇష్టం. అతని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో… పోటాన్ ఇన్ ఏ డబుల్ స్లిట్ అని రాసి ఉంటుంది. అంతరిక్షం చంద్రుడు సూర్యుడు ఇలా నక్షత్రాలు అన్నింటి గురించి తెలుసుకుంటాడు.
అంతరిక్ష నౌకలో ప్రయాణించేటప్పుడు జీవితం ఎలా ఉంటుంది అనే అంశంపై వ్యోమగాములతో మాట్లాడి తెలుసుకున్నాడు రాజ్‌పుత్. ఇలా అతను గతంలో ఓసారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసాకి వెళ్లాడు. అక్కడ ట్రైనింగ్ పొందాడు.