సుశాంత్ ఆత్మహత్య – ట్రోలింగ్పై స్పందించిన సల్మాన్

సుశాంత్ ఆత్మహత్య - ట్రోలింగ్పై స్పందించిన సల్మాన్

0
89

దేశంలో ఇప్పుడు ఎక్కడ విన్నా సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య గురించి వినిపిస్తోంది, అన్యాయంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని, అతనిని కొందరు దారుణంగా కించపరిచారని సినిమా అవకాశాలు రాకుండా చేశారు అని బాలీవుడ్ లో వారసత్వపు హవా కొనసాగుతోందని చాలా మంది విమర్శలు చేశారు.

బాలీవుడ్ లో పలువురు వారసులను పరిచయం చేసిన కరణ్ జోహార్ తో పాటు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వారసులను కూడా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో వారిని అన్ ఫాలో అవుతున్నారు.

దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ .. సల్మాన్ అతని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. బీయింగ్ హ్యూమన్` అనే స్వచ్ఛంద సంస్థపై కూడా విమర్శలు చేశారు.తనపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఇక సుశాంత్ అభిమానులు ఉపయోగించిన భాష వారు ఉపయోగించే తిట్లు శాపనార్దాలు పట్టించుకోవలసిన అవసరం లేదు.. తాము ఎంతో అభిమానించే వ్యక్తిని కోల్పోయిన వారి భావోద్వేగాన్ని అర్ధం చేసుకోవాలి. నా అభిమానులంతా సుశాంత్ కుటుంబం, అతని అభిమానుల పక్షాన నిలబడాలి అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.